Parvathy Thiruvothu | వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సాధించిన మలయాళ స్టార్ హీరోయిన్ పార్వతీ తిరువోతూ (Parvathy Thiruvothu) తనదైన శైలిలో కొత్త ఏడాది 2026కి స్వాగతం పలికింది. న్యూ ఇయర్ రోజున సాధారణంగా సెలబ్రిటీలు పార్టీలు, వెకేషన్లతో బిజీగా ఉంటే, పార్వతీ మాత్రం తన బైక్ పై లాంగ్ రైడ్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్వతీకి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. గత ఏడాది (2025) ఆరంభంలో కూడా ఆమె తన బైక్ రైడింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, “ఇది నా అడ్వెంచరస్ జర్నీ” అని పేర్కొన్నారు. ఇప్పుడు 2026 ప్రారంభంలో కూడా అదే జోష్‌తో లాంగ్ రైడ్‌కు వెళ్లిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమాలో విషయానికి వస్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ (Ullozhukku) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్‌లో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.