Nayanthara | సినిమాల ప్రమోషన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి దారి ఎప్పుడూ డిఫరెంట్. సినిమా హిట్ కావడమే కాదు, ఆ సినిమాను ప్రేక్షకుల దాకా ఎలా తీసుకెళ్లాలన్న విషయంలో కూడా అనిల్ ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేశారు. రాజమౌళి తర్వాత టాలీవుడ్లో ప్రమోషన్ల ట్రెండ్‌ను మార్చిన దర్శకుడిగా అనిల్ పేరు చెప్పుకోవచ్చు. ఆయన ఆలోచనలకు ప్రభావితమై పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా తమ సినిమాల ప్రచారంలో కొత్త పద్ధతులను అనుసరించడం విశేషం. అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.
ఇక ప్రమోషన్స్ విషయంలో అనిల్ మరోసారి తన క్రియేటివిటీని చూపిస్తున్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతారతోనే సినిమా ప్రారంభంలో ఓ స్పెషల్ వీడియో చేయించి అందరినీ ఆశ్చర్యపరిచిన అనిల్, ఇప్పుడు మూవీ ప్రమోషన్స్‌లో కూడా ఆమెను రంగంలోకి దింపారు. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన తాజా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నయనతారే స్వయంగా అనిల్ రావిపూడిని “ఇప్పటివరకు ఒక ప్రమోషనల్ వీడియో చేశావు… ఇప్పుడు సినిమా పూర్తయింది కదా, ఇంకేమైనా ప్రమోషన్స్ లేవా?” అంటూ అడగడం ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తోంది. ఆ మాట విన్న అనిల్ కళ్లు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ, “మీరు అంతట మీరు ప్రమోషన్ చేస్తానని అడగడమే పెద్ద ప్రమోషన్” అంటూ చమత్కారంగా స్పందిస్తాడు. ఇక నయనతారతో సినిమా జనవరి 12న రిలీజ్ అని చెప్పిస్తే చాలని చెప్పడంతో, ఆమె కూడా అదే స్టైల్లో అనౌన్స్ చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది.
“హలో మాస్టారూ… కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇవ్వండి” అంటూ నయనతార చెప్పడం, పక్కన అనిల్ రావడం, ఇద్దరూ కలిసి “ఈ సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం” అనడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తుండగా, ఇకపై సినిమా నుంచి రోజుకో అప్డేట్ ఉంటుందని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి సినిమాతో పాటు ప్రమోషన్లలోనూ అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ చూపిస్తూ, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.
కొంచెం రైట్కి టర్నింగ్ ఇచ్చుకోండి అమ్మా 😘😘
From now, every single day is going to be a celebration of #ManaShankaraVaraPrasadGaru 🥳
Let’s begin the #MSGSankranthiHungama with a never before promotional treat by everyone’s favourite #Nayanthara 😍💥
— Shine Screens (@Shine_Screens) January 1, 2026