The Bengal Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం ‘ది ఢిల్లీ ఫైల్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన టాలీవుడ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ చిత్ర టైటిల్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను ‘ది ఢిల్లీ ఫైల్స్ నుంచి ‘ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్ అని మార్చినట్లుగా ప్రకటించాడు. దీంతో ఈ చిత్రం ది బెంగాల్ ఫైల్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా టీజర్‌ను జూన్ 12న విడుదల చేయనున్నారు.
అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, గోవింద్ నామ్‌దేవ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అగ్నిహోత్రి ‘ఫైల్స్స ట్రయాలజీలో మూడవ భాగం, దీనిలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ (2019) మరియు ‘ది కశ్మీర్ ఫైల్స్’ (2022) కూడా ఉన్నాయి.
BIG ANNOUNCEMENT:
The Delhi Files is now The Bengal Files. Teaser coming this Thursday, 12 June 2025 at 12 PM.
In cinemas on 05 September 2025.
দ্য দিল্লি ফাইলস এখন দ্য বেঙ্গল ফাইলস। টিজার আসছে আগামী বৃহস্পতিবার, ১২ই জুন ২০২৫, দুপুর ১২টায়।
ছবিটি প্রেক্ষাগৃহে মুক্তি… pic.twitter.com/tzXEEYdS28
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 10, 2025
Read More