Vishwambhara | చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘విశ్వంభర’. ఓ మహావ్యక్తి జీవితాన్ని, అతను సృష్టించిన అద్భుతాలనూ రెండున్నర గంటల్లో ఆవిష్కరించేంత గొప్ప స్క్రిప్ట్‌ని దర్శకుడు వశిష్ఠ సిద్ధం చేసినట్టు యూనిట్‌వర్గాలు చెబుతున్నాయి. బ్లాక్‌బస్టర్ ‘బింబిసార’ తర్వాత వశిష్ఠ సంపాదించిన అద్భుతమైన అవకాశం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.
ఈ షెడ్యూల్లో కొంత టాకీపార్ట్, ఒక పాట, ఓ యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించడం జరిగింది. తాజాగా హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ని ప్రారంభించారు. ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ ఈ పోరాట సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమిలియం ఫ్యాక్టరీలో, చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు వశిష్ట. కీలకమైన దశలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి.