‘నా హృదయానికి చాలా దగ్గరైన చిత్రమిది. సినీ ప్రయాణంలో నేను ఎక్కువ కష్టపడి ఈ సినిమా చేశా’ అని అన్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. లక్కీ మీడియా పతాకంపై దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమాలోని డైలాగ్‌లు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఈ సినిమాలోని సంభాషణలు ఆకట్టుకుంటాయి. నటుడిగా నన్ను ఈ సినిమా కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది’ అని తెలిపారు. తేజ సజ్జా మాట్లాడుతూ ‘విశ్వక్సేన్ సినిమాల్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. నాలుగైదు చిత్రాలతోనే తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘పాగల్’ వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కింది. విశ్వక్ సేన్ కెరీర్లో పెద్ద కమర్షియల్ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. మే1న ఈ చిత్రాన్ని విడుదలచేయబోతున్నామని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’