ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!

‘వకీల్‌సాబ్’గా కోర్ట్‌రూమ్‌లో తన పదునైన సంభాషణలతో అగ్రహీరో పవన్‌కల్యాణ్ అభిమానుల్లో జోష్ని నింపారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకులముందుకురానుంది. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రల్ని పోషించారు. సోమవారం చిత్ర ట్రైలర్‌ను ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని పలు థియేటర్లలో విడుదల చేశారు. అనుకోకుండా ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురమ్మాయిల తరపున వాదించే లాయర్‌గా పవన్‌కల్యాణ్ ట్రైలర్లో కనిపించారు. సంతోషంగా సాగిపోతున్న ముగ్గురు యువతుల జీవితాల్లో అనుకోని సంఘటన చోటుచేసుకోవడం..దాని నుంచి బయటపడటానికి వారు చేసే ప్రయత్నాలు…వకీల్‌సాబ్ వారి తరపున వాదించే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘మీరు వర్జినా? అని అమ్మాయిలను అడగొచ్చు..మేం అబ్బాయిలను అడక్కూడదా..ఏం న్యాయం నందాజీ ఇది…కూర్చోండి…కూర్చోండి చాలు’ అంటూ ప్రకాష్‌రాజ్‌తో పవన్‌కల్యాణ్ చెప్పే కౌంటర్ డైలాగ్ ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్లో విజయవంతమైన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ‘వకీల్‌సాబ్’ను తెరకెక్కించారు. తెలుగు నేటివిటీ, పవన్‌కల్యాణ్ స్టార్డమ్కు అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు. ఈ చిత్రానికి తమన్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. బోనీకపూర్ సమర్పకుడు.
ఇది జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే..
‘వకీల్‌సాబ్’ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఈ ట్రైలర్ జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే. లంచ్, డిన్నర్‌కు ఏప్రిల్ 9న సిద్ధంగా ఉందాం. ఇలాంటి సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం. పవన్స్టార్ను ఇలా పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. ఆ నిరీక్షణ ఇప్పటికి పూర్తయింది’ అన్నారు. ట్రైలర్‌ను ఎంజాయ్ చేసినట్లే సినిమాను కూడా సంపూర్ణంగా ఆస్వాదిస్తారని దర్శకుడు శ్రీరామ్ వేణు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

