Gaami | టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwaksen) కాంపౌండ్ నుంచి వచ్చిన అడ్వెంచరస్ ఫాంటసీ ప్రాజెక్ట్ గామి (Gaami). యూనిక్ స్టోరీ టెల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ లాంగ్ టైం పెండింగ్ ప్రాజెక్ట్. ఈ మూవీ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో అద్భుతమైన స్పందన రాబట్టుకున్న గామి మరోవైపు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5లో కూడా సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
గామి తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ రెండు ప్లాట్‌ఫాంలలో సినిమా మిస్సయిన వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. గామి ఇక టెలివిజన్‌లో కూడా సందడి చేయనుంది. గామి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్ వచ్చేసింది. గామి జులై 21న జీ తెలుగులో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ కానుంది. ఇంకేంటి మూవీ లవర్స్ థియేటర్, ఓటీటీలో మిస్సయిన వాళ్లు టీవీలో చూసేయండి మరి.
గామి చిత్రంలో విశ్వక్సేన్ అఘోరాగా కనిపించాడు. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రల్లో నటించారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
World Television Premiere#Gaami Next Sunday at 6pm on #ZeeTelugu#VishwakSen #ChandiniChowdary pic.twitter.com/x7e4e18fKi
— Telugu TV Updates (@telugutvupdts) July 14, 2024
Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్
Darling | ప్రియదర్శి డార్లింగ్‌కు సపోర్ట్‌గా స్టార్ హీరో.. మేకర్స్ నుంచి క్రేజీ వార్త