Mechanic Rocky | టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen) మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో తాజాగా మరో సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. విశ్వక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వంలో VS 10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ చూస్తుంటే కలర్ ఫుల్‌గా సాగింది. ఇక విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రలో అలరించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Also Read..