Anasuya – Chinmayi | ఈ మధ్య కొన్ని తెలుగు టీవీ షోలు ఎంత దారుణంగా తయారయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేటింగ్స్ కోసం అని ఎలా పడితే అలా షోలు చేసేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను చూస్తున్నారు అని ఇంకితం లేకుండా బరి తెగించేస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక ఫేమస్ యాంకర్ కూడా ఇలానే చేసింది. ఓ టీవీ షోలో భాగంగా చిన్న పిల్లాడిని ఎత్తుకుని ముద్దు పెట్టడం వివాదంగా మారింది.
టాలీవుడ్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనకంటూ యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే రీసెంట్గా ఆమె చేసిన పని ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. ఓ టీవీ షోకి అటెండ్ అయిన అనసూయ ఆ షోలో చిన్న పిల్లాడిని ఎత్తుకుని తన మొహం మీద చూపించి ఇక్కడ ముద్దు పెట్టు అని చెంపల మీద కిస్ పెట్టించుకుంటుంది. ఆ తర్వాత లిప్స్ మీదా కిస్ పెట్టు అనగా అతడు పెడతాడు. దీంతో ఈ వీడియో ఫుల్ వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై సింగర్ చిన్మయి ఇన్‌స్టాలో రియాక్ట్ అయ్యింది.
అనసూయ పేరును ప్రస్తావించకుండా.. తల్లిదండ్రులు, ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నప్పుడు ఓ టీవీ షో హోస్ట్ పిల్లవాడిని నోటిపై ముద్దు పెట్టమని అడగడం నేను చూశాను. ఇది చాలా భయంకరంగా అనిపించింది. ఇలాంటివి పిల్లలపై చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ వాళ్లే ఇలాంటివి చేస్తున్నప్పుడు కేరింతలు, క్లాప్స్ కొడుతుండటం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. పిల్లలతో ఈ టీవీల్లో చేసే షోలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. పిల్లలకు సురక్షితమైన బాల్యాన్ని అందించాలని కోరుకునే సమాజంలో ఇవి ఏ మాత్రం ఉపయోగపడవు అంటూ పోస్ట్ పెట్టింది.
Dear Tollywood @IamSaiDharamTej @HeroManoj1 ,
Please take action on Anasuya gaaru.
Please file POCSO act on her.
pic.twitter.com/hHthchERSU— యుగపురుషుడు (@PottiPotato95) July 25, 2024