Redmi Note 15 : చైనాకు చెందిన రెడ్ మి బ్రాండ్ నుంచి నోట్ 15 5జీ మొబైల్ ఫోన్ మంగళవారం ఇండియాలో విడుదలైంది. దీంతోపాటు రెడ్ మి ప్యాడ్ 2 ప్రో కూడా ఈరోజే విడుదలైంది. రెడ్ మి నోట్ 15 రెండు వేరియెంట్లలో రానుంది. ఒకటి 8 జీబీ+128 జీబీ, రెండోది 8 జీబీ+256 జీబీ.
ఈ ఫోన్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ తో రానుంది. అలాగే ఇది చాలా స్లిమ్ ఫోన్. 7.35 మి.మి. మందంతో, 178 గ్రాములు కలిగి ఉంది. ఐపీ 66 రేటింగ్, మిల్-ఎస్టీడీ రేట్ కలిగింది. కిందపడ్డా ఈ ఫోన్ అంత త్వరగా పాడవదు. అలాగే స్నాప్ డ్రాగన్ 6, థర్డ్ జనరేషన్ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 15 బేస్డ్ హైపర్ ఓఎస్ 2 తో రానుంది. 4 ఏళ్లపాటు ఓఎస్ అప్ గ్రేడ్ చేస్తారు. ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. 108 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,520 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. బాక్సులో అడాప్టర్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.22,999, రూ.24,999గా ఉంది. కొన్ని కార్డులపై రూ.3,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది. జవనరి 12 నుంచి ఈ ఫోన్ సేల్ లో అందుబాటులో ఉంటుంది.
రెడ్ మి ప్యాడ్ 2 ప్రొ..
ఇది 12.1 అంగుళాల డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, స్నాప్ డ్రాగన్ 7ఎస్, 4వ జనరేషన్ చిప్ సెట్, 8 జీబీ+128 జీబీ, 8 జీబీ+256 స్టోరేజ్ 12,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ చార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి. వీటి ధరలు రూ.24,999 నుంచి రూ.29,999 వరకు ఉంటాయి.