Vishwak Sen Comments | బాక్సాఫీస్ దగ్గర కోట్లు కుమ్మరిస్తున్న బేబీ సినిమాలో మొదట హీరోగా ఫలానా నటుడిని అప్రోచ్ అయితే కథ వినకుండానే ఆయన నో చెప్పాడని సాయి రాజేష్ ఓ సందర్భంలో సంచలన కామెంట్స్ చేశాడు. అయితే ఆ ఫలానా హీరో విశ్వక్ సేనే అని రాజేష్ ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ పలువురు నెటీజన్లు ఆ నటుడు విశ్వక్ సేన్ అని అపాదించేశారు. ఇక దానికి ఆజ్యం పోస్తూ నో అంటే నో అని మగాళ్లకు వర్తిస్తుందని విశ్వక్ చేసిన ట్వీట్ మామాలు వైరల్ కాలేదు. దాంతో బేబి ఆఫర్ మొదట వచ్చింది విశ్వక్కే అని అందరూ ఫిక్సయిపోయారు. ఇక ఈ కాంట్రవర్సీపై తాజాగా విశ్వక్ స్పందించాడు.
గత సాయంత్రం జరిగిన పేక మేడలు టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ చేసిన కామెంట్స్‌పై కొత్త చర్చలకు దారి తీశాయి. ఏదైనా సినిమా ఒప్పుకోవడం నో చెప్పడం తన స్వేచ్ఛని, అంత మాత్రాన బురద జల్లాల్సిన అవసరం లేదని విశ్వక్ అన్నాడు. ఒక చిన్న సినిమా పెద్ద విజయం సాధించినప్పుడు సంతోషపడే వాళ్ళలో తాను ముందుంటానని, ఆ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక బాగుందని డైరెక్టర్ల వాట్స్ అప్ గ్రూప్‌లో మొదట మేసేజ్ పెట్టింది తనేనని చెప్పుకొచ్చాడు.
ఏ నటుడైనా ఎవరి స్థాయిని బట్టి వారు బిజీగా ఉంటారని, అప్పుడు కలవలేం, కథ వినలేం అని దర్శకుడికి చెబుతుంటామని విశ్వక్ చెప్పాడు. దానికి కొంతమంది ఫీలవుతుంటారు. ఆ విషయంలో నేనేం చేయలేను. అందరినీ ఆనందంగా ఉంచేందుకు నేను బిర్యానీని కాదు. ఒకరి సమయం వృథా చేయడం ఇష్టం లేకనే నా నోటి నుంచి అప్పుడు ఆ సమాధానం వచ్చింది. మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, సినిమా బాగుందని ఎదుటివారిని కించపరచొద్దు. అదొక్కటి బాధగా ఉందంటూ విశ్వక్ తెలిపాడు.
ప్రస్తుతం విశ్వక్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆనంద్ చేసిన పాత్ర విశ్వక్‌కు ఏ మాత్రం సెట్ అవకపోతుండేనని చాలా మంది అభిప్రాయం.