Matti Kusthi Movie Latest Update | ‘ఎఫ్ఐఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్. ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజైన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించింది. పోటీగా ‘ఖిలాడీ’, ‘డీజే టిల్లు’ వంటి సినిమాలున్నా.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో తెలుగులోనూ విష్ణుకు మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘గట్టా కుస్తి’ ఒకటి. చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తి’ పేరుతో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం బుధవారం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడీయోస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై విష్ణు విశాల్, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.
The game is about to begin!#MattiKusthi First Look on 2nd NOV at 11 AM 👊
Get ready ❤️🔥@RaviTeja_offl @TheVishnuVishal @VVStudioz #AishwaryaLekshmi @ChellaAyyavu @Richardmnathan @justin_tunes @editor_prasanna @anbariv @thanga18 @itshravanthi @DuraiKv @decoffl pic.twitter.com/BERnnf7o0p
— RT Team Works (@RTTeamWorks) November 1, 2022
Read also:
Liger Movie | ‘లైగర్’ స్టోరీను ముందుగా ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ నటి?
Puri Jagannadh | పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఆ సీనియర్ స్టార్ హీరోతోనేనా?
Kantara | బాక్సాఫీస్‌పై ‘కాంతార’ దండయాత్ర.. 16వ రోజు కూడా కోటిన్నరకు పైగా షేర్..!