Kantara Movie | విడుదలైన 16వ రోజు 1.88 కోట్ల షేర్.. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో.. పైగా అది డబ్బింగ్ సినిమా.. అందులో హీరో కూడా ఎవరో ఎవరికీ తెలియదు..! కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి..? కన్నడ డబ్బింగ్ సినిమా ‘కాంతార’ తెలుగులో సృష్టిస్తున్న సంచలనాలు ఇవి. ఈ రోజుల్లో ఒక సినిమా మూడు రోజులు ఆడడానికే నానా ఇబ్బందులు పడుతుంది. అందులో చిన్న సినిమా అయితే మూడు రోజులు కాదు.. మొదటి రోజే థియేటర్ నుంచి వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రమోషన్ లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే సంచలన విజయం సాధించింది కాంతార. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చితే ఎంత నెత్తి మీద పెట్టుకుంటారో దీనికి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అర్థమవుతుంది.
కాంతార తెలుగు అనువాద హక్కులను తీసుకున్న నిర్మాత అల్లు అరవింద్ కు ఇప్పటికే దాదాపు 20 కోట్లు లాభాలు వచ్చాయి. ఇంకా ఎన్ని వస్తాయో కూడా అర్థం కావడం లేదు. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరుగుతూ పోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాలకు మించి కలెక్షన్స్ వసూలు చేస్తుంది కాంతార. అసలు తెలుగులో రిషబ్ శెట్టి అంటే ఎవరో ఎవరికీ తెలియదు.. పైగా కాంతార సినిమా పూర్తిగా కన్నడ సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా తెరకెక్కింది. అయినా కూడా కంటెంట్ కనెక్ట్ కావడంతో సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. హిందీలోనూ కాంతార బ్లాక్ బస్టర్ గా నిలిచింది అక్కడ ఇప్పటికే 44 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతా చేస్తే ఈ సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే.
మూడు వారాల తర్వాత కూడా వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో కాంతార హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధిస్తుందని నిజానికి అల్లు అరవింద్ కూడా అంచనా వేయలేదు. కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మాడు కానీ ఇలా కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ ఓపెనింగ్స్ తీసుకొస్తుందని అసలు అనుకోలేదు.
Read Also:
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ నటి?
Hit-2 | అడివిశేష్ ‘హిట్-2’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Manjima Mohan | ‘కడలి’ హీరోతో నాగచైతన్య హీరోయిన్ ప్రేమాయణం.. ఫోటోస్ వైరల్..!
దేవుడు పిలుస్తున్నాడు.. టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్..!