Hit-2 | అడివిశేష్ ‘హిట్-2’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Hit-2 Movie Teaser Date Announced | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి అంచనాలతోనే వస్తున్న చిత్రం 'హిట్-2'.
Hit-2 Movie Teaser Date Announced | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి అంచనాలతోనే వస్తున్న చిత్రం ‘హిట్-2’. 2020లో విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమై అంచనాలు క్రియేట్ చేస్తుంది.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘హిట్-2’ టీజర్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడు హిట్ సినిమా ఒక యూనివర్స్ లాగా తెరకెక్కుతున్నట్లు తెలిపాడు. మల్టీ స్టేట్స్లో కేసులు సాల్వ్ చేసే విధంగా హిట్ యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్‌ను హీరోగా తీసుకుని.. సెకండ్ కేస్‌లో అడివిశేష్‌ను తీసుకోవడానికి కారణం సెపెరేట్ కేసు అని చెప్పాడు. విశ్వక్ సేన్ క్యారెక్టర్ అలాగే ఉందని, హిట్ ఫ్రాంజైజీలో మళ్ళీ వస్తాడని తెలిపాడు. రానున్న పార్ట్స్ ఇంకా పెద్ద స్కేల్లో రూపొందిస్తామని తెలిపాడు. ఇక ‘హిట్-2’ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరి, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంతి తిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

