కోలీవుడ్ లీడింగ్ హీరోల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు విశాల్ (Vishal). ఇప్పటికే ఓ ఇంటివాడు కావాల్సినప్పటికీ.. విశాల్ పెళ్లికి ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతుంది. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూషతో విశాల్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. వెడ్డింగ్ డేట్ కూడా దాదాపు ఖరారైంది. అయితే కొన్ని విబేధాల కారణంగా విశాల్-అనూష వెడ్డింగ్ నిలిచిపోయింది.
ఆ తర్వాత విశాల్ పలు తెలుగు సినిమాల్లో సిస్టర్ పాత్రల్లో నటించిన అభినయతో డేటింగ్లో ఉన్నాడని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా ఇండస్ట్రీ సర్కిల్లో షికారు చేస్తున్నాయి. అయితే తమిళ సినీ ఆర్టిస్టుల కోసం కట్టిస్తున్న భవన నిర్మాణం పూర్తయిన తర్వాత వెడ్డింగ్ వివరాలు తెలియజేస్తానంటూ.. లాఠీ మూవీ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు విశాల్.
తాజాగా విశాల్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై ఇపుడు ఇండస్ట్రీలో తెగ చర్చ నడుస్తోంది. ప్రభాస్ (Prabhas)పెళ్లి చేసుకున్న రోజున తాను కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. పెళ్లి అనేది చాలా బాధ్యత. ఈ విషయం నా మైండ్‌లో ఎక్కడో ఉంది. పెళ్లి విషయం తన ఫోకస్‌లోకి రాలేదని చెప్పుకొచ్చాడు.
ఓ వైపు త్వరలోనే అభినయతో పెళ్లి అంటూ వార్తలు రావడం.. విశాల్ మరోవైపు ప్రభాస్ పెళ్లితో ముడిపెట్టడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ లెక్కన ప్రభాస్ వెడ్డింగ్ అప్డేట్ వస్తే.. విశాల్ వార్త కూడా వస్తుందన్నమాట.. అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
Read Also : Rolex | సూర్యతో రోలెక్స్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్.. ముహూర్తం ఎప్పుడో ..?
Read Also : Virupaksha | పోస్టర్‌తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష కొత్త అప్డేట్
Read Also : Mission Majnu | ఓటీటీలోనే రష్మిక మందన్నా హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్ను