Varalakshmi Sarathkumar | పన్నెండేళ్ల క్రితం విశాల్‌తో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ‘మదగజరాజ’ సినిమా సమస్యలన్నింటినీ దాటుకొని ఇన్నాళ్లకు సంక్రాంతి కానుకగా ఆదివారం(రేపు) విడుదల కానుంది. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ విలేకరులతో ముచ్చటించింది. ‘ ‘మదగజరాజ’ నా రెండో సినిమా. దర్శకుడు సుందర్.సి సెట్లో నాకు నటనలో మళకువలు నేర్పేవారు. చాలా సరదాగా షూటింగ్ జరిగింది. ఈ సినిమా విషయంలో విశాల్ కూడా చాలా కష్టపడ్డారు.
ఈ పాత్రకోసం ఆయన సిక్స్‌ప్యాక్ చేశారు. నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ విడుదల నోచుకోలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు సినిమా విడుదలవుతున్నందుకు ఆనందంగా ఉంది.’ అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. తన వైవాహిక జీవితం గురించి చెబుతూ ‘నికోలయ్ సచ్దేవ్ లాంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం. ఫ్యామిలీ లైఫ్‌కి తను ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులతో నాకంటే ఎక్కువ తనే కాంటాక్ట్‌లో ఉంటారు. మా అమ్మానాన్న కూడా అన్ని విషయాలనూ నాతోకంటే తనతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు ’ అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి.