Virat- Anushka | అనుష్క విరాట్ కోహ్లీ జంట గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్రేజీ జంటలలో ఈ జంటకి మంచి గుర్తింపు ఉంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోగా, వారిద్దరు కలిసినప్పుడల్లా చాలా అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు.అయితే ఈ మధ్య కోహ్లీ చేసిన పని అనుష్కకి కోపం తెచ్చిందని అంటున్నారు. అందుకు కారణం కోహ్లీ అనుకోకుండా నటి అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజీలో పోస్టు చేసిన చిత్రాన్ని లైక్ చేయడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ నడిచింది. ఆ సమయంలో కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం కారణంగా జరిగిందని, ఎలాంటి ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. కట్ చేస్తే తాజాగా బెంగళూరులోని ఎంజీ రోడ్‌లోని ఓ రెస్టారెంట్ బయట విరాట్-అనుష్క జంట డిన్నర్‌కు వస్తూ కనిపించారు..
సాధారణంగా అనుష్క- విరాట్ ప్రైవేట్ స్పేస్‌లో ఎక్కడ కనిపించిన కూడా ఒకరి చేయి విడిచి ఒకరు ఉండరు. కాని తాజాగా మాత్రం అనుష్క ఫేస్ కాస్త డల్‌గా పెట్టినట్టు కనిపించింది. అంతేకాదు కారు దిగి విరాట్ .. అనుష్క కోసం వెయిట్ చేస్తూ తనకి సపోర్ట్‌గా చేయి అందించబోయాడు. కాని అనుష్క విరాట్ చేయి పట్టుకోలేదు. కారు సపోర్టుతోనే కిందకు దిగింది. ఆ సమయంలో విరాట్ ముఖం వైపు చూడలేదు. దిగిన వెంటనే సీరియస్ గా రెస్టారెంట్ లోకి వెళ్లిపోగా, ఆమె వెనక విరాట్ వెళ్లాడు..దీంతో వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో అర్దం కాలేదంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.
వీడియోపై నెటిజన్స్ .. “భాభి గుస్సా హై” వంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై కొంతమంది అభిమానులు ఈ వీడియోను తొలగించాలని సూచించారు, ఇది అనవసరమైన ఊహాగానాలకి తెరతీస్తుందని అంటున్నారు. కాగా, అనుష్క శర్మ తన 37వ పుట్టినరోజును మే 1న జరుపుకుంది. ఆ సందర్భంగా విరాట్ తన భార్యను “బెస్ట్ ఫ్రెండ్, లైఫ్ పార్టనర్, సేఫ్ స్పేస్, బెస్ట్ హాఫ్” అంటూ ప్రేమగా అభివర్ణించాడు. ఇక 2017లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇటలీలో వివాహం చేసుకోగా, వారికి వామికా, అకాయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరిని మీడియా కంట కనపడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.
Virat Kohli & @AnushkaSharma Seen At Lupa Restaurant In MG Road, Bengaluru.🤍
.
.
.#Virushka #RCB #IPL25 @imVkohli pic.twitter.com/8e7XcmesUO— virat_kohli_18_club (@KohliSensation) May 6, 2025