Vir Das | ఇండియన్ స్టాండప్ కమెడియన్, బాలీవుడ్ నటుడు వీర్ దాస్ (Vir Das) అరుదైన ఘనతను సాధించాడు. హాలీవుడ్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డుల (Emmy Awards) వేడుకకు హోస్ట్‌గా నిర్వహించే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో ఈ వేడుకలో హోస్ట్‌గా నిర్వహించే తొలి భారతీయ నటుడిగా వీర్ దాస్ రికార్డు క్రీయేట్ చేయనున్నాడు. ఈ వేడుక నవంబర్‌లో న్యూయార్క్ వేదికగా జరుగనుండగా.. ఈ వేడుకకు హోస్ట్‌గా వీర్ దాస్ వ్యవహరించనున్నారు. అయితే వీర్ దాస్ ఎంపిక కావడంపై ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఈ విషయంపై వీర్ దాస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నాపై మీరు చూపుతోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఇండియన్ యాక్టర్ హోస్ట్‌గా కనిపించనున్నాడు. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అంటూ వీర్ రాసుకోచ్చాడు. స్టాండ్ అప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన వీర్‌దాస్ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి అలరించాడు.
Also Read..