Peka Medalu | టాలీవుడ్లో రాబోతున్న మరో ఫన్ ఎంటర్టైనర్ పేకమేడలు (Peka Medalu). వినోద్ కిషన్ (Vinod kishan) , అనూష కృష్ణ జంటగా నటిస్తున్నారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రే నిర్మిస్తున్నారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఫన్నీ వీడియోను షేర్ చేసింది టీం.
అప్పులోళ్లు వెనక పడుతున్నారు.. టైం లేదు.. చెప్పింది జాగ్రత్తగా విను.. అప్పు తీరిస్తే నెక్ట్స్ రోజే మరిచిపోతారు. అదే తీర్చకపోతే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. పుట్టినందుకు జనాలకు గుర్తుండిపోయేలా బతుకు.. ఇంకా చాలా ఉన్నాయి. థియేటర్లలో చెబుతా.. వచ్చేయ్ అంటూ షేర్ చేసిన ప్రమోషనల్ వీడియో ఫన్నీగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ సినిమాలో రితిక శ్రీనివాస్, జగన్ యోగిరాజ్, అనూష నూతల, గణేశ్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హరిచరణ్ కె. కెమెరామెన్ కాగా.. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు వినోదాన్ని జోడించి ఈ సినిమా చేశామని దర్శకుడు తెలిపారు.
అప్పు తీరిస్తే Next రోజే మర్చిపోతారు, అదే తీర్చకపోతే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు – #Laxman
3 Days to go…Don’t miss this year’s 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 #PekaMedalu in theatres on JULY 19th! 🥳 #PekaMedaluOnJuly19 ✨
Book your tickets now:… pic.twitter.com/igFyfeQGQV
— BA Raju’s Team (@baraju_SuperHit) July 16, 2024
Janhvi Kapoor | స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాన్వీకపూర్ Ulajh ట్రైలర్
Sardar 2 | మిషన్ కంబోడియా టైం.. కార్తీ సర్దార్ 2లో స్టార్ యాక్టర్
Kanguva | సూర్య కంగువ సాంగ్‌లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్