Veera Dheera Sooran | సిద్దార్థ్ నటించిన చిన్నా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్ (SU ArunKumar). ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తోన్న వీర ధీర సూరన్ (Veera Dheera Sooran) సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్‌గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు.
ఎస్‌యూ అరుణ్‌కుమార్ వివాహం మధురైలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో సతీమణితో కలిసి ఏడడుగులు వేశాడు ఎస్‌యూ అరుణ్ కుమార్. ఈ వేడుకకు తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
విక్రమ్, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ఎస్ జే సూర్య, వీర ధీర సూరన్ హీరోయిన్ దుషారా విజయన్, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సెలబ్రిటీలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
వీర ధీర సూరన్ మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏపీలో శ్రీలక్ష్మి మూవీస్, తెలంగాణలో ఎన్వీఆర్ బ్యానర్లు విడుదల చేయనున్నాయి. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వెడ్డింగ్‌లో సెలబ్రిటీల సందడి..
#VeeraDheeraSooran – Director “SU ArunKumar” Marriage clicks 📸💫#ChiyaanVikram – Siddharth – VijaySethupathi – SJSuryah – VigneshShivan – Sasi 🌟 pic.twitter.com/xxzA24nYe1
— Tharani ᖇᵗк (@iam_Tharani) February 2, 2025
Our legend @chiyaan 🔥😍 graced the wedding of Dir #SuArunkumar with his love and blessings!”#Chiyaanvikram🔥🔥 #VeeraDheeraSooran #Chiyaan63@sooriaruna @Kalaiazhagan15@proyuvraaj @mugeshsharmaa pic.twitter.com/vLAHSjXDKf
— Chiyaan Vikram Fans (@chiyaanCVF) February 2, 2025
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే