కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’ (Cobra). అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కోబ్రా టీం ట్విటర్ లో మంగళవారం చిట్ చాట్ సెషన్లో పాల్గొన్నది. ఈ సందర్భంగా థళపతి విజయ్ గురించి విక్రమ్ చెప్పిన మాటలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
‘విజయ్ (Vijay) సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇష్టం. ఏ పరిస్థితిలోనైనా సెలెన్స్‌గా ఉంటాడు. విజయ్ చాలా గొప్ప నటుడు. విజయ్ డ్యాన్స్ నన్ను ఎప్పటికీ ఆకట్టుకుంటోంది. భవిష్యత్‌లో నేను అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో విజయ్‌తో కలిసి ఖచ్చితంగా నటిస్తా. ఇది అద్బుతమైన ఐడియా. ఖచ్చితంగా కార్యరూపం దాల్చాలి. విజయ్ స్టైల్లో చెప్పాలంటే నేను వెయిటింగ్..’అంటూ ముగించాడు విక్రమ్. విక్రమ్ చెప్పిన మాటలు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడుండబోతుందని తెలియాల్సి ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి కీ రోల్స్ పోషించారు. రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మియా జార్జ్, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీ రోల్స్ పోషించారు. ఎస్ఎస్ లలిత్ కుమార్సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
Read Also : Samantha | లాంగ్ బ్రేక్..మళ్లీ నెట్టింట ప్రత్యక్షం కానున్న సామ్..!
Read Also : Mahesh Babu Look | మహేశ్‌బాబు కొత్త లుక్..స్పెషల్ ఇదే..!
Read Also : Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ