Vikram On Hotstar | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ టేకింగ్, విజన్ వేరే లెవల్. కాగా విడుదలైన మొదటి రోజు నుండే కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఇటీవలే విక్రమ్ రూ.400 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే.
ఇప్పటికీ విక్రమ్ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విక్రమ్ సినిమా జూలై 8నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్‌స్టార్ సంస్థ అధికారికంగా వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కమల్ ‘మనకు నచ్చని సినిమాని ఎన్ని సార్లు చూసిన చాల్లేదు కదూ.. పదండి చూసుకుందా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో’ అంటూ విక్రమ్ స్టైల్లో గన్ పేల్చుతూ చెప్పాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
The Eagle is coming to @DisneyPlusHSTel! #Vikram premieres July 8.#VikramOnDisneyplusHotstar @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl #FahadhFaasil @Suriya_offl @Udhaystalin @RKFI @RedGiantMovies_ @DisneyPlusHS pic.twitter.com/Al1NbmyE16
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) June 29, 2022
Read Also:
Dilraju | మరో సారి తండ్రయిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
The Warrior | ‘ది వారియర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Prabhas Salaar | ‘సలార్’లో కమెడియన్ సప్తగిరి..?