The Warrior Trailer date | విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే భావనతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’లో కూడా సిద్ధార్థ పాత్రలో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది.
ఈ క్రమంలో చిత్రబృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జూలై 1న 7.57 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రామ్ ఇంటెన్సీవ్ లుక్స్‌తో చేతిలో టార్చ్ పట్టుకుని ఎవర్నో కోపంగా చూస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కృతి శెట్టీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.