బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 21:20:25

ఆ వార్త‌లు వ‌ట్టి పుకార్లేన‌ట‌..!

ఆ వార్త‌లు వ‌ట్టి పుకార్లేన‌ట‌..!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ న‌టిస్తోన్న చిత్రం పుష్ప‌. సుకుమార్ డైరెక్ష‌న్ లో ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే ఈ మూవీలో త‌మిళ స్టార్ విక్ర‌మ్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. పుష్ప టీం ఈ పాత్ర కోసం ఇప్ప‌టివ‌ర‌కు విక్ర‌మ్ ను సంప్ర‌దించ‌లేద‌ని, విక్ర‌మ్ విల‌న్ గా న‌టిస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని కోలీవుడ్ స‌ర్కిల్ నుంచి అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వచ్చింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మారేడుమిల్లి అరణ్యంలో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవ‌లే పుష్ప‌రాజ్ అట‌వీ ప్రాంతంలోకి ప్ర‌వేశిస్తున్న ఫొటోతోపాటు షూటింగ్ లొకేష‌న్ లో బన్నీ డీగ్లామ‌రైజ్ డ్ లుక్ లో స్టిల్ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo