పెళ్లి చూపులు సినిమాలో క్లాసీ లుక్ లో కనిపించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తక్కువ టైంలో ఫేమ్, స్టార్డమ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఇపుడు టాలీవుడ్, బాలీవుడ్ దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ యాక్టర్. ఈ స్టార్ హీరో సినిమాలే కాకుండా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. విజయ్‌దేవరకొండ ‘రౌడీ యూ’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చి విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ పెట్టాడు.
‘మీరు నేను ‘రౌడీ’లం. మనం 3 సంవత్సరాలు రౌడీగా ఉన్నాము. 3 సంవత్సరాలు మార్కెట్ లోకి వెళ్లి ప్రతిచోటా పేరు తెచ్చుకున్నాము. ప్రతి ఒక్కరూ తన సొంత ఫీల్డ్‌లో, ఎటువంటి పరిమితులు, భయం లేకుండా, అపారమైన ప్రేమతో రౌడీని ఆదరించారు. రౌడీకి స్టాపింగ్ పాయింట్ లేదు. మనం ముందుకెళ్తుంటే రౌడీ అంతటిని ఆక్రమించుకుంటుందనిస సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హిందీలో లైగర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!