The Greatest of all time | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. The GOAT నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ది గోట్ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ప్రీ సేల్స్‌లో తన మేనియా ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాడు దళపతి విజయ్. ఓపెనింగ్ డేన ప్రీసేల్స్ పరిమిత షోలలోనే రూ.5 కోట్లకుపైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. అసలైన విధ్వంసం నేడు ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రీమియర్లు ఉదయం 4 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం) ప్రారంభమవుతాయని తెలియజేశారు మేకర్స్.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#GOAT – Overseas opening day presales smashes $700K+ just with limited shows 🔥🔥
The real rampage begins today !! Worldwide first premieres begins at 4am IST 💥#TheGreatestOfAllTime pic.twitter.com/57vpbG2ZJc
— Star South – Overseas (@StarSouthEnt) August 27, 2024
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?