Lokesh Kanagaraj | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ (Coolie) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించినప్పటికీ, మిశ్రమ స్పందనను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులకు ఈ సినిమా కొంచెం నిరాశపరిచింది. అయితే దీనిపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కూలీ సినిమాపై వేల సంఖ్యలో విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ నేను గమనించాను. నా తదుపరి చిత్రంలో ఆ తప్పులు దొర్లకుండా కచ్చితంగా సరిదిద్దుకుంటాను అని లోకేష్ అన్నాడు. కూలీ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వచ్చినా, ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారంటే అది కేవలం రజనీకాంత్ సార్ మీద ఉన్న ప్రేమ వల్లే అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాత నాకు స్వయంగా చెప్పారు. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘ఖైదీ 2’ (Kaithi 2) లేదా ‘విక్రమ్ 2’ తో ‘లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU)ని ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ‘కూలీ’లో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని, తన తదుపరి సినిమాను మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
#LokeshKanagaraj about #Coolie :
“Coolie received 1000s of criticisms.. I’ll try to rectify it in my next film.. Even with those criticisms, people watched the film for #Rajinikanth sir.. Producer told me the film collected 500crs.. Thanks to everyone..”pic.twitter.com/iBucccatjI
— Laxmi Kanth (@iammoviebuff007) December 26, 2025