Naveen Polishetty | హీరో నవీన్ పోలిశెట్టి స్పీడుకు, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి తోడవ్వడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘అనగనగా ఒక రాజు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి, అందాల నటి మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘రాజు గారి పెళ్లిరో’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి, చిత్ర యూనిట్‌తో కలిసి సందడి చేశారు. స్టేజ్ మీద నవీన్ పోలిశెట్టి అడగగానే ఏమాత్రం సంకోచించకుండా ఆయనతో కలిసి ఈ సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఆమె ఉత్సాహాన్ని చూసి అక్కడున్న విద్యార్థులు ఈలలు, గోలలతో కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ నవీన్ పోలిశెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. సినీ పరిశ్రమలో వెనుక ఎవరూ లేకుండా సొంతంగా ఎదగడం చాలా కష్టం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, కష్టపడి పైకి వస్తున్న నవీన్ ఎంతోమంది యువతకు స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
What a man 🔥🙌🏻 🕺
Vibe is @NaveenPolishety @NaveenPolishety is Vibe
anna yekkadunte a place anna control loki vellipovalsindhe 🤙🔥❤️🔥 #NaveenPolishetty #PreetiReddy— AkshaySai (@Akshay5989) December 26, 2025