Indian-Origin Student | అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి (Indian-Origin Student) అరెస్ట్ అయ్యాడు. కుటుంబ సభ్యులపైనే పలుమార్లు దాడికి పాల్పడటంతోపాటూ.. సొంత ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
డల్లాస్ (Dallas)లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం (University of Texas)లో చదువుతోన్న 22 ఏండ్ల భారత సంతతికి చెందిన విద్యార్థి మనోజ్ సాయి లెల్లా.. తరచూ కుటుంబ సభ్యులపై ఉగ్ర బెదిరింపులకు (Terrorist Threat) దిగుతూ, దాడి చేస్తున్నాడు. అంతేకాదు ఇంటికి కూడా నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో మనోజ్‌పై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మనోజ్ సాయి లెల్లాను ఫ్రిస్కో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మనోజ్ గత కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Kyiv | ట్రంప్-జెలెన్స్కీ భేటీకి ముందు.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా
Storm Devin | హాలిడే సీజన్లో అమెరికాను వణికిస్తున్న డెవిన్ మంచు తుపాను.. 1,800 విమానాలు రద్దు