Israeli Soldier: నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిలీ సైనికుడు.. వీడియో
Israeli Soldier: ఇజ్రాయిల్ రిజర్వ్ సైనికుడు .. తన వద్ద ఉన్న ఏటీవీ వాహనంతో.. రోడ్డు పక్కన నమాజ్ ప్రార్థన చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
రామల్లా: ఇజ్రాయిల్‌కు చెందిన రిజర్వ్ సైనికుడు(Israeli Soldier) .. తన వద్ద ఉన్న ఏటీవీ వాహనంతో.. రోడ్డు పక్కన నమాజ్ ప్రార్థన చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. వెస్ట్ బ్యాంక్‌లోని రామల్లా వద్ద ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయిలీ సైన్యం పేర్కొన్నది. ఆయుధం కలిగిన రిజర్వ్ సైనికుడు చేసిన అటాక్ గురించి తెలిసినట్లు ఇజ్రాయిలీ ఆర్మీ ప్రకటనలో తెలిపింది. ఆ సైనికుడు రిజర్వ్ కేటగిరీకి చెందినవాడని, అతన్ని మిలిటరీ సర్వీసు నుంచి తొలగించినట్లు ఆర్మీ పేర్కొన్నది. అతని వద్ద ఉన్న ఆయుధాన్ని సీజ్ చేశారు. తీవ్ర ఉల్లంఘనకు అతను పాల్పడినట్లు ఆర్మీ ఆరోపించింది. సాధారణ దుస్తుల్లో సైనికుడు ఉన్నట్లు తెలిపారు. వాహనంతో జరిపిన దాడిలో గాయపడ్డ పాలస్తీనా వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిజర్వ్ సైనికుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. అతన్ని 5 రోజుల పాటు కస్టడీలో పెట్టనున్నారు.
Shocking footage shows an armed Israeli settler driving a four-wheel-drive vehicle and deliberately running over a Palestinian worshipper for no apparent reason, then continuing to try to push him off the road. The incident occurred near Ramallah. pic.twitter.com/4RQuY3jdLv
— ✌️🇵🇸✌️ Mohammed Najjar (@hamada_pal2020) December 25, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

