విజయ్ సేతుపతి (Vijay Sethupathi ), సమంత, ఫహద్ ఫాసిల్, రమ్యకృష్ణ ( Ramya Krishnan) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ (Super Deluxe). 2019లో తమిళ వెర్షన్ విడుదలవగా మంచి హిట్‌గా నిలిచింది. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేశారు. ఆగస్టు 6న సూపర్ డీలక్స్ వరల్డ్ వైడ్ గా ఆహాలో ప్రీమియర్ కానుంది.
త్యాగరాజన్ కుమారరాజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మోహం, అవిశ్వాసం, లైంగికత, మతం, నేరం వంటి అంశాల చుట్టూ వినోదంతోపాటు భావోద్వేగ పూరిత కథనంతో సాగుతున్న ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ఫహద్ ఫాసిల్, సమంత కపుల్ ఓ డెడ్‌బాడీతో సమస్యల్లో పడతారు. రమ్యకృష్ణ ఈ చిత్రంలో సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది.
సూపర్ డీలక్స్ చిత్రంలో ట్రాన్స్ జెండర్ ఉమెన్ గా విజయ్ సేతుపతి నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. గాయత్రి, అశ్వంత్ అశోక్ కుమార్, అబ్దుల్ జబ్బర్, విజయ్ రామ్, నోబుల్ కే జేమ్స్, మృణాళిని రవి కీ రోల్స్ లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sonu Sood Niddhi song | ఇస్మార్ట్ భామతో సోనూసూద్ సాంగ్..ఫస్ట్ లుక్ అదుర్స్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో