కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) తెలుగులో మరో సినిమా చేస్తున్నాడన్న ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పటికే తెరపైకి వచ్చింది. తాజాగా దీనిపై సందీప్ కిషన్ ( Sundeep Kishan ) సినీ లవర్స్ కు క్లారిటీ ఇస్తూ మరో అప్ డేట్ ఇచ్చేశాడు. విజయ్ సేతుపతితో చాలా క్లోజ్ గా, సరదాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సందీప్ కిషన్. ఒకే ఒక్కడు..ది బిగ్ బ్రదర్ మక్కళ్ సెల్వన్..లోడింగ్ అవబోతున్నాడు..అంటూ ట్వీట్ చేశాడు సందీప్ కిషన్.
హ్యాపీ మూడ్లో ఉన్న సందీప్ కిషన్-విజయ్ సేతుపతి ఆప్యాయంగా ఒకరినొకరు కిస్ చేసుకున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్-డీకే ఈ సినిమాను సమర్పించబోతున్నారు. ఇది పాన్ ఇండియా కథాంశం అని తెలుస్తోండగా..సందీప్ కిషన్ లీడ్ రోల్ లో నటించనున్నాడు.
విజయ్ సేతుపతి మరోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. భరత్ చౌదరి (డెబ్యూ) దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని రంజిత్ జెల్కోడి నిర్మించనున్నారు.
The Big Brother Love ❤️
— Sundeep Kishan (@sundeepkishan) August 2, 2021
The one and one “Makkal Selvan”@VijaySethuOffl 🔥
Loading Soon… pic.twitter.com/H5XDuxgdSH
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో