The Greatest of all time | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. The GOAT నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. విజయ్ ఓ వైపు ఓల్డ్ మ్యాన్‌గా, మరోవైపు యంగ్ లుక్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఓ చిట్ చాట్‌లో వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ సార్‌ను మొదట క్లీన్ సేవ్ లుక్‌లో చూపించినప్పుడు ఆయన నన్ను తిట్టాడు. కానీ ఇప్పుడు ఆ లుక్‌ను విజయ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సెట్లో విజయ్ను చూసి యంగ్ బాయ్‌లా కనిపిస్తున్నారని ప్రశంసించారు. సినిమాలో ఆయన్ను చూసి షాకవుతారంటూ చెప్పుకొచ్చాడు వెంకట్ ప్రభు.
ది గోట్ అవుట్‌పుట్ పట్ల విజయ్ చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు ఓ ప్రాజెక్ట్ గురించి విజయ్ ఇంతలా మాట్లాడటం తానిప్పటివరకు వినలేదని.. ఆయన సన్నిహితుడు చెప్పారన్నాడు వెంకట్ ప్రభు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Thangalaan | భారీ సక్సెస్.. విక్రమ్ తంగలాన్పై కంగువ యాక్టర్ సూర్య
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?