‘ఖుషి’ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని తన పారితోషికం నుంచి అభిమానుల కుటుంబాలకు కోటి రూపాయలు అందిస్తానని కొద్ది రోజుల క్రితం చిత్ర హీరో విజయ్ దేవరకొండ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ‘ఖుషి’ హ్యాపీనెస్ షేరింగ్ పేరిట వంద కుటుంబాలను ఎంపిక చేసి లక్ష రూపాయల చొప్పున చెక్స్ అందించారాయన. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ పాల్గొన్నారు.
తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు తాను సినిమాలు చేస్తున్నంతకాలం సహాయం చేస్తూనే ఉంటానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఆదరిస్తున్న అభిమానులకు సాయం చేసే గొప్ప సంప్రదాయాన్ని విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఆరంభించడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు.