Vijay Deverakonda | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి వీడీ12 (VD12). జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుస్తుండగా.. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా విజయ్ దేవరకొండ టీం శ్రీలంకలో ల్యాండైన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండకు శ్రీలంకలో ఘనస్వాగతం పలికిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా శ్రీలంక షెడ్యూల్ గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా షూట్ కోసం విజయ్ దేవరకొండ టీం శ్రీలంకలో 45 రోజులపాటు ఉండనుందట. ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండతోపాటు ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం శ్రీలంకలో ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తు్న్నారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ (Gireesh Gangadharan) సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. విజయ్ దేవరకొండ మరోవైపు టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో VD14 కూడా చేస్తున్నాడు. రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) డైరెక్ట్ చేస్తున్నాడు.
Sara Ali Khan | అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సారా అలీఖాన్ మెరుపులు
SSMB 29 | అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేశ్ బాబు.. ఎస్ఎస్ఎంబీ 29 క్రేజీ వార్తేంటో తెలుసా..?
Shankar | ఏంటీ ఇండియన్ 2లో కమల్ హాసన్ తక్కువ టైమే కనిపిస్తాడా..? శంకర్ క్లారిటీ
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్