Vijay Deverakonda | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తోన్న వీడీ12 (VD12). శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వీడియో రూపంలో రౌండప్ చేస్తోంది.
షూట్లో భాగంగా విజయ్ దేవర కొండ అండ్ టీం ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న నదిలో బోటులో విహరిస్తున్న వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విజయ్ టీం ఎక్కడుందనేది క్లారిటీ లేకున్నా.. గౌతమ్ తిన్ననూరి అండ్ చిత్ర యూనిట్ ఎలాంటి సన్నివేశాలు ప్లాన్ చేసిందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళం టెక్నీషియన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ మరోవైపు టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో VD14 మూవీ కూడా చేస్తున్నాడు. దీంతోపాటు రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola)తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ