Kushi | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలోని అందమైన లొకేషన్లలో కొనసాగుతోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి విడుదలైన కొన్ని ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఖుషి నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
తాజా టర్కీలోని ఓ రెస్టారెంట్లో విజయ్, సామ్ చిల్ అవుట్ మూడ్‌లో ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట హల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టిల్ షేర్ చేస్తూ.. మీలోని ఉత్తమ క్వాలిటీస్ చూస్తారు.. మీలోని చెడును చూస్తారు.. మీ ఒడిదుడుకులను చూస్తారు.. కొంతమంది స్నేహితులు సున్నితంగా నిలబడతారు.. అంటూ క్యాప్షన్ పెట్టింది సామ్. ఇప్పుడీ స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఇప్పటికే స్పెషల్ పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారు. ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రెస్టారెంట్లో విజయ్, సామ్
సామ్‌కు బై చెప్తూ..
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023