Vijay Deverakonda | యుద్ధం నాతోనే అంటూ కత్తి పట్టిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక రౌడీ హీరో పుట్టినరోజు కానుకగా కొత్త సినిమా అనౌన్స్మెంట్లు కూడా వచ్చాయి.
Vijay Deverakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక రౌడీ హీరో పుట్టినరోజు కానుకగా కొత్త సినిమా అనౌన్స్మెంట్లు కూడా వచ్చాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ విజయ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ఇదిలావుంటే తాజాగా మరో మూవీకి సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చింది.
రాజావారు రాణిగారు (RajaVaaru RaniGaaru) దర్శకుడు రవికిరణ్ కోలా (Ravikiran Kola)తో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో 59వ చిత్రంగా రానున్న ఈ చిత్రం రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుంది. ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ‘నా చేతుల మీద ఉన్న రక్తం వాళ్ల చావుకు చిహ్నం కాదు… వ్యక్తిగా నా పునర్జన్మకు సంకేతం’ అని పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ పోస్టర్లో నెత్తురుతో నిండిన కత్తి, ఆ కత్తి పట్టిన చెయ్యి కనిపిస్తుండగా.. ‘కత్తి నాదే… నెత్తురు నాదే… యుద్ధం నాతోనే’ అని ఆ పోస్టర్ మీద రాసి ఉంది. విజయ్ తొలిసారి మాస్ యాక్షన్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది.
“The blood on his hands is not of their death, but of his own Rebirth.”#SVC59@TheDeverakonda@SVC_official #DilRaju garu, #Shirish garu#HBDTheVijayDeverakonda pic.twitter.com/TWzvdIXgCd
— Ravi Kiran Kola (@storytellerkola) May 9, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

