Burnt Alive: బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది సజీవదహనం
Burnt Alive: 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది.
గురుగ్రామ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు(Burnt Alive). మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణికులంతా భక్తులే. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నారు.
కేఎంపీ హైవేపై ఉన్న తౌరు వద్ద 2 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బస్సులో ఉన్న 60 మంది బంధువులే. పంజాబ్‌లోని హోసియాపూర్‌కు చెందినవాళ్లు. మథుర-వృందావన్ లో పర్యటించిన తిరిగి వెళ్తున్న సమయంలో బస్సుకు నిప్పు అంటుకున్నది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని స్థానిక ప్రజలు గమనించారు. ఈ విషయాన్ని వాళ్లు పోలీసులకు తెలియజేశారు. బస్సులో మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని చూసిన స్థానికులు బస్సును ఆపాలని డ్రైవర్‌ను కోరారు. కానీ బస్సు ఆగలేదు. ఆ తర్వాత వాళ్లు మోటార్‌సైకిల్‌పై బస్సును ఛేజ్ చేశారు. డ్రైవర్‌కు నిప్పు అంటుకున్న విషయాన్ని చెప్పారు. కానీ ఆ సమయానికి బస్సులో మంటలు వ్యాపించాయి.
విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఆ స్పాట్‌కు చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఆ సమయానికే 8 మంది సజీవ దహనం అయ్యారు. గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు. 9 మంది మరణించారని, దీంట్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, మరో 15 మంది గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, అందరూ నిలకడగా ఉన్నారని, అగ్నిప్రమాదానికి కారణం తెలియదని ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ తెలిపారు.
Watch: Eight people were killed and around two dozen injured when a tourist bus caught fire in Nuh, Haryana. pic.twitter.com/on1DG64moK
— IANS (@ians_india) May 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

