Devaraje Gowda: డీకేఎస్ వంద కోట్లు ఆఫర్ చేశాడు.. ప్రజ్వల్ కేసులో దేవరాజే ఆరోపణ
Devaraje Gowda: ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు లీకేజీ కేసులో హెచ్డీ కుమారస్వామిని ఇరికించేందుకు డీకే శివకుమార్ ప్రయత్నించారని ఆ కేసులో అరెస్టు అయిన దేవరాజే గౌడ తెలిపారు. డీకే తనకు వంద కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు గౌడ పేర్కొన్నారు. పెన్‌డ్రైవ్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.
బెంగుళూరు: ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు లీకైన కేసులో.. అడ్వకేట్ జీ దేవరాజే గౌడ(Devaraje Gowda) సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు నలుగురు మంత్రుల పాత్ర ఈ కేసులో ఉన్నట్లు ఆయన ఆరోపించారు. హసన్ జిల్లా ప్రిజన్స్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో హెచ్డీ కుమారస్వామి పేరును ఇరికించేందుకు డీకే శివకుమార్ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కుమారస్వామిపై ఆరోపణలు చేస్తే తనకు వంద కోట్లు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం సిద్దమైనట్లు దేవరాజే గౌడ ఆరోపించారు.
ప్రజ్వల్ వీడియోలు లీకేజీ వెనుక కుమారస్వామి ఉన్నట్లు చెప్పేందుకు తనకు డీకే వంద కోట్లు ఆఫర్ చేశాడని, మంత్రులు చాలువరయస్వామి, కృష్ణ బైర గౌడ, ప్రియాంక్ ఖర్గేతో పాటు మరికొంత మంది ఆ ఆఫర్ చేసినట్లు దేవరాజే గౌడ తెలిపారు. తనకు అడ్వాన్స్‌గా బౌరింగ్ క్లబ్‌కు అయిదు కోట్లు ఆఫర్ చేసినట్లు వెల్లడించాడు. కానీ దానికి తాను అంగీకరించలేదన్నారు. అందుకే కుట్ర పన్ని తనను ఇరికించినట్లు గౌడ ఆరోపించారు.
మోదీకి, బీజేపీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో డీకే శివకుమార్ ఈ ప్లాన్ వేసినట్లు గౌడ ఆరోపించారు. తనపై లైంగిక వేధింపులు, రేప్ కేసు నమోదు చేశారని, కానీ ఏ ఆధారాలు చిక్కలేదని, ఇప్పుడు పెన్ డ్రైవ్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గౌడ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

