Vijay Deverakonda | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి వీడీ12 (VD12). జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టీం శ్రీలంకలో ల్యాండైంది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీలంకలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి విక్రమ్, అంగమలై డైరీస్, జల్లికట్టు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేసిన పాపులర్ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ (Gireesh Gangadharan) పనిచేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ దీంతోపాటు టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో VD14 కూడా చేస్తున్నాడు. రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 59వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.
#VijayDeverakonda receives a Warm Welcome in Sri Lanka! ❤️✨@TheDeverakonda #VD12 pic.twitter.com/1DFNELG9Jc
— Teju PRO (@Teju_PRO) July 8, 2024
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?