ఏది ఎదురొచ్చినా కొట్లాడుడే
‘ఓ తల్లి తన కొడుకు ఛాంపియన్‌గా నిలవాలని, భారతదేశ పతాకాన్ని విదేశీ గడ్డపై రెపరెపలాడించాలని కలలు కనే కథాంశంతో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇలాంటి సినిమాను బాయ్‌కాట్ చేయాలని అంటారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ‘లైగర్’ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పందిస్తూ “బాయ్‌కాట్ చేయాలని అడుగుతున్న వారి గొడవ ఏమిటో నాకు తెలియదు. మేము ఈ సినిమా ప్రచారం కోసం దేశంలో ఏ నగరానికి వెళ్లినా ప్రజలు ఎంతో ప్రేమ కనబరుస్తున్నారు.
ఆ జనాల కోసమే మేము సినిమా చేశాం. వారి ప్రేమ ఉన్నంత వరకు నేను ఎవరికీ భయపడను. మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదీ ఎదురొచ్చినా కొట్లాడుడే. మూడేళ్ల శ్రమ ఫలితమే ఈ సినిమా. మేమంతా భారతీయులం. దేశాన్ని గొప్పగా ప్రేమిస్తాం. కంప్యూటర్ల ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్ కాదు మాది. ఈ రోజు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే యాభై మంది బైక్‌లతో నాకు స్వాగతం పలికారు. వారంతా కరోనా టైమ్‌లో నేను మొదలుపెట్టిన కరోనా మిడిల్‌క్లాస్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చిన వారే. ఆ విరాళాలతో నేను ప్రజల్ని ఆదుకోగలిగాను. దేశాన్ని ముందుకు నడపడానికి అలాంటి యువకులు మనకు కావాలి కానీ ఎదుగుతుంటే క్రిందికి లాగేవాళ్లు ఎందుకు?’ అని ప్రశ్నించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

