Vijay Deverakonda | విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘వీడీ 14’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా తాలూకు సెట్‌వర్క్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తూ ‘పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది.
బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కథాంశం. విజయ్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.