విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజా సమాచారం ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకురాబోతున్నట్లు తెలిసింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, మ్యాడ్స్వేర్ చిత్రాలు వరుసగా మార్చి 28, 29 తేదీల్లో రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్‌ను రీషెడ్యూల్ చేశారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి త్వరలో అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవలే తెలియజేశారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి.