విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందబోతున్న ‘రౌడీ జనార్దన’ చిత్రం దసరాకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనివార్యకారణాల వల్ల ఈ సినిమా ఓపెనింగ్ వాయిదా పడ్టట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 11న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ సైతం మొదలవుతుందని అంటున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ ఇది. కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది. ఈ సినిమాలో విలన్గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించనున్నారని టాక్. ఇదిలావుండగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ ఎంటర్టైనర్ ఇప్పటికే తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెలలోనే రెండో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.