Vijay Devarakonda – Rashmika | టాలీవుడ్లో హాట్ రూమర్ కపుల్‌గా నిలిచారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. వీరిద్దరు కలిసి గీత గోవిందం (2018) , డియర్ కామ్రేడ్ (2019) చిత్రాలలో నటించారు. ఈ సినిమాల సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయం అని జోస్యాలు చెబుతున్నారు. వారి రిలేషన్ గురించి ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా ఇంతవరకు స్పందించింది లేదు. అయితే రష్మిక ఇటీవల ‘కుబేర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విజయ్ గురించి మాట్లాడుతూ, నేను అతని దగ్గర ఉన్నవన్ని తీసుకుంటాను అని చెప్పి అభిమానులలో అనేక సందేహాలు కలిగించింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక ఒకే కారులో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు పక్కనే పక్కనే కూర్చొని కనిపించారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ దృశ్యం కెమెరాకి చిక్కింది. ముంబై ఎయిర్‌పోర్టు వద్ద వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించటం కెమెరాల కంటపడడంతో వీడియో వైరల్ అయింది. తొలుత విజయ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగా, కొంత సేపటికే రష్మిక కూడా అదే కారులో ఎక్కి కూర్చున్నారు. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టు మళ్లీ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లు అయ్యింది.
ఇటీవలి కాలంలో పలు ఈవెంట్లకు వీరిద్దరూ ఒకే చోట కనిపించడం, ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించడం వంటి ఘటనలు ఇప్పటికే సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, రష్మిక నటించిన తాజా చిత్రం ‘కుబేర’ జూన్ 20న విడుదల కానుంది.మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక ముంబై వెళ్లి ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా తన తదుపరి చిత్ర పనులతో బిజీగా ఉండగా, ఆ మూవీ పనుల కోసం ముంబై వెళ్లాడా అని ముచ్చటించుకుంటున్నారు. ఏది ఏమైన తొలిసారి వీరిద్దరు ఇలా జంటగా కనిపించడంతో ఆ పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.