Vijay Devarakonda | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత కింగ్డమ్ సినిమాతో సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం నాగవంశీ నిర్మించాడు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు విజయ్. ఈ సినిమాకు మొదటగా నాగదేవర ‘నాగ దేవర’ అనే టైటిల్ అనుకున్నామని అయితే అప్పటికే ఎన్టీఆర్ అన్నా దేవర ప్రకటించడంతో ఈ టైటిల్ వదులుకున్నట్లు విజయ్ చెప్పుకోచ్చాడు.
అయితే ఈ సినిమాలో సాంగ్ డిలీట్ చేయడంపై విజయ్ స్పందిస్తూ.. ఆ ఆలోచన తనది కాదని.. దర్శకుడు గౌతమ్.. ఎడిటర్ నవీన్ నూలి కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు. అయితే ఎందుకు పాటను తొలగించారని ప్రేక్షకుల ఇప్పుడు అడుగుతున్నారు. ఆ పాటను జత చేసే పనిలో మా మేకర్స్ పనిచేస్తున్నారంటూ విజయ్ చెప్పుకోచ్చాడు.
విజయ్ అప్కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుంది. అలాగే రవి కిరణ్ కోలాతో రౌడీ జనార్థన్ అనే సినిమాను చేయబోతున్నాడు