Liger Movie Run Time | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఈయన నటించిన ‘లైగర్’ కోసం అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఒక్క ట్రైలర్‌తోనే లైగర్ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘లైగర్’ సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలుగా ఉండనుందని టాలీవుడ్ వర్గాల టాక్. సినిమాకు ఈ రన్‌టైం చాలా వరకు ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ చిత్రానికి సౌత్‌తో పాటు నార్త్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read Also:
Macherla Niyokavargam | నితిన్ ‘రా రా రెడ్డి’ పాట సరికొత్త రికార్డు?
NBK107 Movie | #NBK 107 షూటింగ్ పున:ప్రారంభించే ఆలోచనలో బాలయ్య..!
Pakka Commercial | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పక్కా కమర్షియల్.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?