Macherla Niyokavargam | నితిన్ ‘రా రా రెడ్డి’ పాట సరికొత్త రికార్డు?
Ra Ra Reddy Song Record | యూత్ స్టార్ నితిన్ ఎప్పటికప్పుడు విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నితిన్ ఆశలన్ని ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి.ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రంలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం ఇటీవలే ‘రా రా రెడ్డి’ పాటను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుండి విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మిలయన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ పాటలో జయం సినిమాలోని ‘రానురానంటూనే చిన్నోదో’ పాట పల్లవి బిట్ సోషల్ మీడియాను ఊపేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు ఈ పాట అరుదైన ఘనత సాధించింది. ఈ పాట షార్ట్ వీడియో ప్లాట్ఫారమ్లన్నింటిలో 500 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. నిజానికి ఈ ఒక్క పాట సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చాడు.
MACHERLA MASS MANIA🔥
A Mammoth 5️⃣0️⃣0️⃣M+ Views Across all Short Video Apps for #RaRaReddyIAmReady from #MacherlaNiyojakavargam 🤙🏻💥
▶️ https://t.co/HUTyhtYXwi@actor_nithiin @yoursanjali @IamKrithiShetty @SrSekkhar @SreshthMovies #MahathiSwaraSagar @adityamusic#MNVFromAug12th pic.twitter.com/DVSIl1eVLN
— Sreshth Movies (@SreshthMovies) August 4, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

