Pakka Commercial | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పక్కా కమర్షియల్.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Pakka Commercial On OTT | టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 1న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ, స్క్రీన్‌ప్లే రొటీన్‌గా ఉండటం.. మారుతి మార్క్ కామెడీ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. పక్కా కమర్షియల్ చిత్రానికి దాదాపు రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఫైనల్‌గా రూ.8.05 కోట్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.
కాగా ఈ చిత్రం గత రాత్రి 12గంటల నుండి ప్రముఖ ఓటీటీ సంస్థలైన ‘నెట్‌ఫ్లిక్స్’, ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు. గోపించంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో హ్యట్రిక్ చేస్తున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ ఘన విజయాలు సాధించాయి. ఇక ‘పక్కాకమర్షియల్’ ఫేయిల్యూర్‌తో మారుతి ఖాతాలో వరుసగా రెండు ఫ్లాప్‌లు పడ్డాయి. ప్రస్తుతం ఈయన ప్రభాస్‌తో హారర్ కామెడీ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

